Sthanikam - Truth Matters
Logo

బావిలో పడ్డ వ్యక్తికి పోలీసుల రక్షణ

Updated : 21 Nov 2026 21:11 IST
As Preferred Source 1 min read
బావిలో పడ్డ వ్యక్తికి పోలీసుల రక్షణ

తాడు సాయంతో సురక్షితంగా బయటకు.. టూ టౌన్ పోలీసుల చాకచక్యం.

నల్లగొండ: ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని బావిలో పడి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వ్యక్తిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. పోలీసుల సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది.

పట్టణంలోని సతీష్ నగర్‌కు చెందిన రాసమల్ల రంజిత్ కుమార్ (38) ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని బావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టూ టౌన్ ఎస్‌ఐ సైదాబాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాడు సాయంతో బావిలోకి దిగి చాకచక్యంగా రంజిత్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు.

ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్‌ఐ సైదాబాబు, పోలీసు సిబ్బంది ఎం.ఏ. ఫారూఖ్, బాలకోటి స్వామిలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవలను స్థానికులు ప్రశంసించారు.

Sthanikam

బావిలో పడ్డ వ్యక్తికి పోలీసుల రక్షణ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి