చిట్యాల: చిట్యాల శివారులోని దూన్ పంజాబీ ధాబాలో పనిచేస్తున్న బాద్షా (40–45) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో విధుల్లో ఉండగా అతడికి ఫిట్స్ వచ్చాయి. తోటి కార్మికుడు నిశ్చల్‌రెడ్డి ప్రథమ చికిత్సలో భాగంగా ఇనుప వస్తువును చేతిలో పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాద్షా తన గదికి వెళ్లి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు సిబ్బంది నిద్రలేపగా స్పందించలేదు. నోట్లో నుంచి తెల్లటి నురగ రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ధాబా మేనేజర్ అమర్‌జీత్ సింగ్ ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధాబాలో కార్మికుడి మృతి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి