శేరిలింగంపల్లి, కొత్తగూడ, అక్టోబర్ 5: సి అండ్ డి బ్లాక్ ఏషియన్ సన్‌సిటీ ప్లాట్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికల్లో ఏ. గోవర్ధన్‌రెడ్డి ప్యానల్ ఘన విజయం సాధించింది. సెప్టెంబర్ 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 94 ఓట్లు పోలవగా.. 92 ఓట్లు చెల్లుబాటయ్యాయి. తొమ్మిది డైరెక్టర్ పోస్టులకు పది మంది అభ్యర్థులు పోటీ పడగా గోవర్ధన్‌రెడ్డి ప్యానల్ 68 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు నూతన అధ్యక్షుడు ఏ. గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
నాలుగేళ్లుగా కొనసాగిన పోరాటం అనంతరం సీనియర్ సిటిజన్ల ఆధ్వర్యంలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. నూతన కార్యవర్గంలో అనంత్ పద్మనాభరావు మోచెర్ల, ఏ. గోవర్ధన్‌రెడ్డి, బి. నరేష్‌కుమార్‌రెడ్డి, ఏ. ప్రమీలారాణి, పుండ్ల శ్రీకాంత్, మనుక సురేష్‌యాదవ్, పి. రామకుమార్, ఎస్. శాంతిలక్ష్మి, షేక్ షకీర్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షుడిగా, మనుక సురేష్‌యాదవ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
తమ ప్యానల్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన ప్లాట్ యజమానులకు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి