హయాత్‌నగర్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉమ్మడి హయాత్‌నగర్ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చైర్మన్ గజ్జి భాస్కర్ అన్నారు. డిఫెన్స్ కాలనీలో రూ.52.20 లక్షల వ్యయంతో రెండు పార్కుల అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు.
కాలనీలోని 2,780 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక పార్కు, 547 చదరపు గజాల్లో మరో పార్కును ఆధునిక హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పార్కుల్లో పచ్చదనంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా డివిజన్‌లో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కామేశ్వరరావు, నరసింహ, గోపాల్‌రెడ్డి, కోటేశ్వరరావు, మాధవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కృష్ణమూర్తి, మల్లారెడ్డి, హరిబాబు, సుధాకర్‌రెడ్డి, మోహనకృష్ణ, సంజీవరెడ్డి, వేణు, రాజవర్ధన్‌రెడ్డి, శ్రవణ్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి