బాలెంలలో మృతుల కుటుంబాలకు పరామర్శ.. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల అందజేత
సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి ఆదివారం పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని స్టేజ్ సమీపంలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలకుంట్ల నాగరాజు, గుర్రం సైదులు కుటుంబ సభ్యులను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పటేల్ రమేష్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక వంటివారని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో పాటు ఆపద సమయంలో తోడుగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి