ఆటపాటలతో సందడి చేసిన మహిళా ఉద్యోగులు..
సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు
కోదాడ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కోదాడ ఆర్టీసీ డిపోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ సందర్భంగా చాటి చెప్పారు.ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఈ వేడుకలతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలకమని పలువురు పేర్కొన్నారు. మహిళా ఉద్యోగుల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ కార్యక్రమంలో డిపో డిఎం శ్రీనివాస్, సీఐ నాగశ్రీ మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి