Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నేలపట్లలో ఘనంగా '5కె రన్, వాక్' జెండా ఊపి ప్రారంభించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

Updated : 18 Oct 2026 19:55 IST
As Preferred Source 1 min read
నేలపట్లలో ఘనంగా '5కె రన్, వాక్' జెండా ఊపి ప్రారంభించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

ఆరోగ్య పరిరక్షణకు వ్యాయామం నిత్యకృత్యం కావాలి

విజయదశమి పండుగను పురస్కరించుకుని నేలపట్లలో ఆర్గనైజర్ దబ్బటి రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన '5కె రన్, వాక్' కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఉదయం 6:00 గంటలకు ప్రారంభమైన ఈ పరుగుకు చౌటుప్పల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి పరుగును ప్రారంభించారు.​ఈ సందర్భంగా దాదాపు 150 మందిని ఉద్దేశించి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ. "ఆరోగ్యమే మహాభాగ్యం" అని, నిత్య జీవితంలో వ్యాయామం అలవర్చుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పరుగు, నడకలో పాల్గొన్న క్రీడాకారులు, గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భూమ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన ఆయన, ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. గతంలో కూడా ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించిన దబ్బటి రాములు గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా గ్రామంలోని యువతను, ప్రజలను భాగస్వాములను చేస్తూ మరిన్ని క్రీడా, సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.​పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జ్ఞాపికగా మెడల్స్ అందజేశారు. అనంతరం క్రీడాకారులకు, అతిథులకు దబ్బటి రాములు గౌడ్ సొంత ఖర్చులతో భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు అందించిన ప్రోత్సాహం, చేసిన ఏర్పాట్లను చూసి గ్రామస్తులు, అతిథులు రాములు గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.​ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ పాక చిరంజీవి, ఉదరి యాదయ్య, పిఎసిఎస్ రావుల స్వామి, పందుల లింగస్వామి, బేధదం లింగస్వామి, ప్రకాష్, మాజీ సర్పంచ్‌లు కప్పల శ్రీనివాస్, చౌట వేణుగోపాల్, వంగాల భిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ బట్టి శ్రీనివాస్, వార్డు మెంబర్లు బూడిద లింగస్వామి, కత్తుల సాయికుమార్, గంజి లింగేశ్, చౌట శివ గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలరాజు, మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ శ్రీధర్ రెడ్డి, స్థానిక వాకర్స్ డప్పు స్వామి, జిన్రు సంతోష్ రెడ్డి, చిన్నం నర్సింహా, మదన్, కిరణ్, వెంకటేష్, సంజీవ, సైదులు, భాస్కర్, బుట్టి సత్యం, చంద్రశేఖర్, దబ్బటి బాలరాజు, చిన్నం శివశంకర్, భాను, తేజ, అరుణ్, ప్రవీణ్, మహేష్, సత్యం, వినోద్, జగత్, ఇతర ప్రజాప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా '5కె రన్, వాక్' జెండా ఊపి ప్రారంభించిన చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి