Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

అంకిరెడ్డిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Updated : 18 Oct 2026 20:29 IST
As Preferred Source 1 min read
అంకిరెడ్డిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం పరిధిలోని వినాయక నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు.​ మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు.​తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాలనీ వాసులంతా ఒకేచోట చేరి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. కాలనీ ప్రజలందరికీ వారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంబరాల్లో గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేశ్ గౌడ్, ఉపసర్పంచ్ వలందాసు మహేశ్ గౌడ్, కాలనీ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

అంకిరెడ్డిగూడెంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి