Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

మహిళల ఆటపాటలతో మార్మోగిన నిదాన పల్లి

Updated : 18 Oct 2026 20:28 IST
As Preferred Source 1 min read
మహిళల ఆటపాటలతో మార్మోగిన నిదాన పల్లి

సద్దుల బతుకమ్మకు సర్పంచ్‌ బహుమతులు.

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో భారీ బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. భారీ బతుకమ్మ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

బతుకమ్మలకు బహుమతుల పంపిణీ

గ్రామంలో ప్రత్యేకంగా ఆకర్షించిన భారీ బతుకమ్మను గుర్తించి గ్రామ సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్య, మాజీ సర్పంచ్ గూత్త నరసింహారెడ్డి బహుమతులు అందజేశారు. బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, గ్రామ మహిళలు, పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల ఆటపాటలతో మార్మోగిన నిదాన పల్లి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి