Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పోలీస్ ఆయుధాలు, వాహనాల వినియోగంలో అప్రమత్తత అవసరం.జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్.

Updated : 18 Oct 2026 19:54 IST
As Preferred Source 1 min read
పోలీస్ ఆయుధాలు, వాహనాల వినియోగంలో అప్రమత్తత అవసరం.జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్.

విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి.

భువనగిరి, అక్టోబర్ 18 స్థానిక ప్రతినిధి :

పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాలు, వాహనాలను జాగ్రత్తగా వినియోగిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ సూచించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం భువనగిరిలోని డీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుధ, వాహన పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోలీసులు ఆరోగ్యంగా, ఆనందంగా విధులు నిర్వహించాలి

ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ఆయుధాలు, వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వాటిని బాధ్యతాయుతంగా, అప్రమత్తతతో వినియోగించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఎస్పీ కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌ నాయుడు, సురేష్‌, సీఐ చంద్రబాబు, ఆర్‌ఐలు శ్రీనివాస్‌ నాయుడు, లతీఫ్‌ ఉద్దీన్‌, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ ఆయుధాలు, వాహనాల వినియోగంలో అప్రమత్తత అవసరం.జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి