నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి టోర్నమెంట్ (బోరంచ ప్రీమియర్ లీగ్)ను నిర్వాహకుడు జి. నగేష్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ పోటీల్లో బి. మచేందర్ కెప్టెన్‌గా వ్యవహరించిన నేచురల్ స్టార్ట్స్ టీమ్ విజేతగా నిలవగా, జి. నగేష్ కెప్టెన్‌గా వ్యవహరించిన మేనేజ్మెంట్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. పండుగల సందర్భంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల గ్రామ యువతలో స్నేహభావం, ఐక్యత పెరుగుతాయని, అందరూ కలిసి ఆనందంగా గడిపేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు సహకరించిన దాతలు కే. విట్టల్ రెడ్డి, ఎన్. వెంకట్, ఎన్. అశోక్, ఆర్.పండరి, మంగ,ఈరన్నలకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత తదితరులు పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తిని చాటిన బోరంచ యువత.. ఘనంగా క్రికెట్ పోటీలు
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి