Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 10:27 AM

రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

03-10-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రూ.60 వేల విలువైన 118 కిలోల కుళ్లిన, ఎక్స్‌పైరీ ఆహార పదార్థాలు ధ్వంసం.

యాదాద్రి భువనగిరి: భువనగిరిలోని రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు సంస్థకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 32(1)(a) కింద ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసు జారీ చేశారు.

స్టోర్‌లో కుళ్లిన కూరగాయలు, పండ్లు, ఎక్స్‌పైరీ ఆహార పదార్థాలతో పాటు లేబులింగ్‌లో లోపాలను అధికారులు గుర్తించారు. పరిశుభ్రత, పెస్ట్‌ కంట్రోల్‌, సిబ్బంది ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, తప్పనిసరి రికార్డుల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో సుమారు రూ.60 వేల విలువైన 118 కిలోల కుళ్లిన కూరగాయలు, పండ్లు, ఎక్స్‌పైరీ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు.

నిర్ణీత గడువులోగా గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని అధికారులు సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఫుడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వి. జ్యోతిర్మయి హెచ్చరించారు.

Sthanikam

రిలయన్స్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News