Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:17 AM

రేపు మద్యం దుకాణాలు బంద్ – సీపీ సజ్జనార్ ఆదేశాలు

02-03-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణలో హోలీ పండుగను ప్రశాంతంగా మరియు సురక్షితంగా జరుపుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లలో కూడా మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలు చేయనున్నారు.హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పాదచారులు, వాహనదారులపై బలవంతంగా రంగులు చల్లరాదని సూచించారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో షీ టీమ్స్ ప్రత్యేక నిఘా నిర్వహిస్తాయని తెలిపారు.ప్రజలు హోలీ పండుగను సంతోషంగా, కానీ బాధ్యతతో జరుపుకోవాలని, శాంతి భద్రతలకు సహకరించాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రేపు మద్యం దుకాణాలు బంద్ – సీపీ సజ్జనార్ ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News