Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:14 AM

రేపు గురుజువాడలో శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

28-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో కోహీర్ మండలం పరిధిలో గురుజువాడ గ్రామ వాస్తవ్యులు మరియు గ్రామ చుట్టూ పక్కన వివిధ గ్రామాలు, పట్టణాలలో నివసిస్తున్న శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులందరికీ వినమ్ర నమస్కారములు. రేపు అనగా 01-03-2026 ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గురుజువాడ గ్రామంలో కనుల పండుగలా, చరిత్రలో నిలిచే విధంగా శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుచున్నాము. హిందూ ధర్మ రక్షణ కొరకు, న్యాయం కొరకు, స్వరాజ్య స్థాపన కొరకు తన జీవితమంతా అర్పించిన మహావీరుడు, పరాక్రమశాలి యోధుడు అయిన శివాజీ మహారాజ్ గారి జ్ఞాపకార్థంగా ఈ శుభకార్యాన్ని జరుపుకొనుచున్నాము. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మహిళల కోలాటం, దాండియా నృత్యాలు, చిన్నపిల్లల ఆటలు పాటలు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. కావున గ్రామ పెద్దలు, అన్నతమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలు, యువత, చిన్నారులు ప్రతి ఒక్కరూ ఆ రోజు తమ తమ పనులను పక్కనపెట్టి కుటుంబ సభ్యులందరితో కలిసి హాజరై ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఆ రోజు ఎవరింటిలోను వంటలు చేయవలసిన అవసరం లేదు; ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కార్యక్రమ స్థలంలోనే ఏర్పాటు చేయబడినది. మనమందరం కలిసి మహా ప్రసాదాన్ని స్వీకరించి ఆనందోత్సాహాలతో ఈ శుభదినాన్ని గడపుదాం. మీ అందరి హాజరు మా కార్యక్రమానికి మహత్తరమైన బలంగా నిలుస్తుంది. జై శ్రీరామ్ ???? జై శివాజీ మహారాజ్ ????

Sthanikam

రేపు గురుజువాడలో శ్రీశ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News