రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రామన్నపేట కోర్టు పరిధిలోని న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు ఉన్న అవసరాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాన్ని పరిశీలించిన ఆయన.. కోర్టు ఏర్పాటుకు సంబంధించిన ఫైలును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్‌మోహన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నందాల బిక్షం, సీనియర్ నాయకులు పూన బాలకృష్ణ, గుత్త నర్సింహారెడ్డి, పిట్ట వెంకట్‌రెడ్డి, రామిని రమేష్, శంబాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి