రామన్నపేట, అక్టోబర్ 6: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ 10వ వార్డు (రంగమ్మగూడెం) కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ వంగాల అవినాష్ సోమవారం రామన్నపేట సీఐ మలుగూరి రవిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు, ముఖ్యంగా పేదలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధిగా తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి