Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 01:39 PM

రజక సంఘం భవనం ముందు సీసీ రోడ్డు నిర్మించాలి

06-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సర్పంచ్‌కు వినతిపత్రం అందజేసిన రజక సంఘం నాయకులు.

వెలిమినేడు: రజక సంఘం భవనం ముందు సీసీ రోడ్డు నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతూ రజక సంఘం నాయకులు గ్రామ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని 9వ వార్డులో రజక సంఘం భవనం ఉంది. భవనం వద్ద రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ఆధ్వర్యంలో సుమారు 120 రజక కుటుంబాల సభ్యులు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య, 9వ వార్డు సభ్యుడు మహంకాళి లింగస్వామికి వినతిపత్రం అందజేశారు. సంఘ భవనం ముందు సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం కోశాధికారి గోలి మహేష్, కార్యవర్గ సభ్యుడు గోలి అంజయ్య, మాజీ ప్రధాన కార్యదర్శి గోలి అంజనేయులు, రజక సంఘం నాయకులు గోలి నరేష్, గోలి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రజక సంఘం భవనం ముందు సీసీ రోడ్డు నిర్మించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News