భువనగిరి, అక్టోబర్ 6:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను హ్యాపీ మెడోస్ ప్లే స్కూల్ (విద్యానగర్), ప్రెసిడెన్సీ ప్రైమరీ స్కూల్ (గంజ్)లో సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రంగురంగుల పుష్పాలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్ తేగల జయలక్ష్మి మాట్లాడుతూ.. పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను భావితరాలకు పరిచయం చేసే వేదికలన్నారు. బతుకమ్మ ద్వారా చిన్నారుల్లో ఐక్యత, స్నేహభావం, పరస్పర గౌరవం, టీమ్ స్పిరిట్ వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలు, పాటలు, చిన్నారుల నృత్యాలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. వేడుకలు విద్యార్థులకు మధుర జ్ఞాపకంగా నిలిచాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి