Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:37 AM

పిల్లలమర్రి 12వ వార్డులో అభివృద్ధి పనుల క్యాలెండర్‌ల పంపిణీ

12-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి 12వ వార్డులో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన క్యాలెండర్‌లను బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సోలిపేట, పిల్లలమర్రి బిఆర్ఎస్ నాయకులు సంయుక్తంగా నిర్వహించారు. వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి జగదీష్ రెడ్డి చేసిన కృషిని ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్‌లను విడుదల చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగదీష్ రెడ్డి నిరంతరం పనిచేశారని, పిల్లలమర్రి ప్రాంతం అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పిల్లలమర్రి 12వ వార్డులో అభివృద్ధి పనుల క్యాలెండర్‌ల పంపిణీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News