20 రోజులుగా పరీక్షలు లేవు.. మందులు, ఇంజక్షన్లు కూడా కరువు.
రామన్నపేటఅక్టోబర్ 7 స్థానికం ప్రతినిధి :
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సరిగా అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆస్పత్రిని పరిశీలించిన టీడీపీ మండల ఇన్‌చార్జి మీర్జా పజిల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు బత్తుల సత్యం, వడ్లకొండ సత్తయ్య సమస్యలను గుర్తించారు. దాదాపు 20 రోజులుగా వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని, మందులు, ఇంజక్షన్లు, గాయాలకు ఉపయోగించే ఆయింట్‌మెంట్లు సైతం అందుబాటులో లేవని తెలిపారు. ఈ సమస్యలపై డీఎంహెచ్‌ఓ, సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేసి, వెంటనే అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల తరఫున పోరాటం చేపడతామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి