కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు మునగాల మండలం సీతానగరం గ్రామంలో బుధవారం అర్హులైన 17 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ బాధవత వీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కాసర్ల కోటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం కానుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు సహకరిస్తున్న కోదాడ ఎమ్మెల్యే నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు లబ్ధిదారులు, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో నరేష్, సూర్యాపేట జిల్లా డీసీసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు సతీష్, ఓరుగంటి రవి, కాంగ్రెస్ నాయకులు షేక్ పాషా, గోగుల లక్ష్మణ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి