ఇద్దరి పరిస్థితి విషమం.. పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కూన్యతండాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం సోమవారం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం.. కూన్యతండాకు చెందిన ధనావత్ వెంకట్రామ్, ధనావత్ కృష్ణ కుటుంబాల మధ్య కొంతకాలంగా పాత గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ధనావత్ కృష్ణ కుటుంబానికి చెందిన ధనావత్ దశ్రు, ధనావత్ శివాజీ, ధనావత్ బాబులు.. వెంకట్రామ్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ దాడిలో ధనావత్ గమ్మ, ధనావత్ చింటూ, ధనావత్ శివ, ధనావత్ బాలతో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఘటనపై ఇరువర్గాలు త్రిపురారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సమర్పించాయి. కేసు నమోదు చేసి దాడికి దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి