Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పట్టభద్రులూ.. ఓటరుగా నమోదు చేసుకోండి! ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటే కీలకం.

Updated : 02 Nov 2026 17:33 IST
As Preferred Source 1 min read
పట్టభద్రులూ.. ఓటరుగా నమోదు చేసుకోండి! ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటే కీలకం.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి.

టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. సూర్యనారాయణ రెడ్డి పిలుపు.

భువనగిరి, నవంబర్‌ 2: స్థానికం ప్రతినిధి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (టీపీడీఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు, విద్యావేత్త డా. సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి పట్టభద్రుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించడంతోపాటు విద్యావంతుల ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక వేదికగా నిలుస్తాయన్నారు. విద్యావంతుల గొంతుకకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రతి ఓటు ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదుపై నిర్లక్ష్యం వహించకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల హక్కులు, సమస్యల పరిష్కారానికి విద్యావంతుల భాగస్వామ్యం ఎంతో అవసరమని డా. సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Sthanikam

పట్టభద్రులూ.. ఓటరుగా నమోదు చేసుకోండి! ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటే కీలకం.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి