అనాజిపురం: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని సీపీఎం అనాజిపురం శాఖ 1 కార్యదర్శి ఎదునూరి వెంకటేశం కోరారు. 2023 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకుముందు డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు ఓటరు నమోదుకు అర్హులని తెలిపారు.
ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా మార్కుల మెమో, పాస్‌పోర్టు సైజు ఫొటో, సెల్‌ఫోన్ నంబర్ అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు సైతం మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఎవరూ అవకాశాన్ని కోల్పోవద్దని కోరారు. నవంబర్ 6, 2026 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉందని వెంకటేశం తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి