తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు దిశగా రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కుతాడి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని తమ సంఘం గత కొంతకాలంగా పోరాటం చేస్తోందని తెలిపారు. తమ చిరకాల డిమాండ్‌ను ప్రభుత్వం గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఒకే వ్యవస్థలో ఉండటంతో ఆదివాసీ ఎరుకల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటుతో గిరిజనుల సమస్యలకు ప్రత్యేక గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివాసీ ఎరుకల సామాజిక వర్గానికి తగిన గుర్తింపు కల్పించాలని, ప్రత్యేక ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించాలని కుతాడి సురేష్ ప్రభుత్వాన్ని కోరారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి