Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా దామనూరి అశోక్ జన్మదిన వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 06, 2026 02:58 PM

ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు లేఖ. గ్రీవెన్స్‌ డేను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో ఆవుల రాములు.

06-10-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి, గ్రీవెన్స్‌ డే కార్యక్రమాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఆవుల రాములు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఎంఆర్‌ఓ లాల్‌బహదూర్‌ 2, ఎంపీఓ ఎండీ 2, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ 1, పీఆర్‌ ఏఈఈ సందీప్‌రెడ్డి 1 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎంపీడీవో ఆదేశించారు.

అయితే సెప్టెంబర్‌ 28న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ముగ్గురు అధికారులు గైర్హాజరైన విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాసినట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ డేలో వినతులు సమర్పించాలని కోరారు.

కార్యక్రమంలో ఎంఏఓ ఎజాజ్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంఈఓ సురేందర్‌రెడ్డి, ఎంఓ బేబీ శాలిని, ఏఈలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు లేఖ. గ్రీవెన్స్‌ డేను సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో ఆవుల రాములు.

Article Image

రామన్నపేట: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి, గ్రీవెన్స్‌ డే కార్యక్రమాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఆవుల రాములు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఎంఆర్‌ఓ లాల్‌బహదూర్‌ 2, ఎంపీఓ ఎండీ 2, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ 1, పీఆర్‌ ఏఈఈ సందీప్‌రెడ్డి 1 ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎంపీడీవో ఆదేశించారు.

అయితే సెప్టెంబర్‌ 28న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ముగ్గురు అధికారులు గైర్హాజరైన విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాసినట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ డేలో వినతులు సమర్పించాలని కోరారు.

కార్యక్రమంలో ఎంఏఓ ఎజాజ్‌ అహ్మద్‌ఖాన్‌, ఎంఈఓ సురేందర్‌రెడ్డి, ఎంఓ బేబీ శాలిని, ఏఈలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News