కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బుధవారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సాగునీరు, విద్యుత్, యూరియా, రైతుబంధు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
విద్యుత్ ఛార్జీల భారం, గృహజ్యోతి పథకం అమలు, ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు, గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి, కల్యాణలక్ష్మి, పెన్షన్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమైందని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి