Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 03, 2026 05:27 PM

ఓయో హోటళ్లలో వరుస హత్యలు.. హైదరాబాద్‌లో కలకలం

03-10-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓయో హోటళ్లలో ఏం జరుగుతోంది?.. వరుస మరణాలతో ఆందోళన.

హోటల్‌ రూమ్‌లోకి వెళ్లాక.. అంతే! వరుస హత్యలతో హైదరాబాద్‌లో కలకలం

హైదరాబాద్‌: నగరంలోని హోటల్‌ గదుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న మహిళల మృతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మాదాపూర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, మియాపూర్‌ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలతో హోటళ్లలో భద్రత, అతిథుల వివరాల పరిశీలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మాదాపూర్‌లో నిఖిత మృతి..

హత్య కేసు: సెప్టెంబర్‌ 21న మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో షారోన్‌ నిఖిత అనుమానాస్పద స్థితిలో కనిపించగా, అనంతరం పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీనివాస రవితేజను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

ఎస్‌ఆర్‌ నగర్‌లో శిరీష మృతి:

సెప్టెంబర్‌ 24న ఎస్‌ఆర్‌ నగర్‌లోని గోకుల్‌ ప్రైడ్‌ హోటల్‌లో బి.శిరీష ఓ వ్యక్తితో కలిసి చెక్‌ఇన్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మృతిచెందగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్‌లో తప్పుడు పేర్లు, గుర్తింపు పత్రాలతో చెక్‌ఇన్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

మియాపూర్‌లో వైద్య విద్యార్థిని మృతి:

అక్టోబర్‌ 2న మియాపూర్‌లోని ఓ హోటల్‌ గదిలో 27 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థిని కోమటి సృజన మృతదేహం లభ్యమైంది. ఆమె సెప్టెంబర్‌ 30న ఓ స్నేహితుడితో కలిసి హోటల్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ఫిర్యాదుతో హత్య కేసు నమోదు కాగా, మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

భద్రతపై ప్రశ్నలు..

వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లలో అతిథుల గుర్తింపు వివరాల పరిశీలన ఎంతవరకు జరుగుతోంది? సీసీ కెమెరాల నిర్వహణ, అనుమానాస్పద కదలికలపై హోటల్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారా? ఘటనలు జరిగిన హోటళ్లపై నిబంధనల అమలు, భద్రతా ప్రమాణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారా? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. అయితే ప్రతి ఘటనకు కారణాలు, పరస్పర సంబంధం ఉందా అనే అంశాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

Sthanikam

ఓయో హోటళ్లలో వరుస హత్యలు.. హైదరాబాద్‌లో కలకలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News