Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంచరకుంట్ల కాలనీ కమ్యూనిటీ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల నిరసన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 06:51 PM

ఒకే కుటుంబంలో ముగ్గురికి పట్టాలు.. ఒకరికి గోల్డ్‌ మెడల్‌

07-10-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేందుకు డా. బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ చక్కటి అవకాశం కల్పిస్తోందని పలువురు బంగారు పతక గ్రహీతలు పేర్కొన్నారు. వర్సిటీ కోర్సు మెటీరియల్‌, కౌన్సిలింగ్‌ తరగతులు, అధ్యాపకుల బోధన ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు.

ముగ్గురికీ పట్టాలు.. కరీంనగర్‌కు చెందిన వట్టిపల్లి పావని ఎంఏ ఎకనామిక్స్‌లో బంగారు పతకం సాధించారు. స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే పీజీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇదే విద్యా సంవత్సరంలో తన కుమార్తె సౌందర్య ఎంఎస్సీ బోటనీలో, తండ్రి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. దీంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు పట్టాలు అందుకున్నారు.

నాలుగో తరగతిలోనే చదువు మానేసి.. నిర్మల్‌ జిల్లా బైంసాకు చెందిన శ్రీనివాస్‌ ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బంగారు పతకం సాధించారు. నాలుగో తరగతిలోనే చదువు మానేసి, ప్రవేశ పరీక్ష ద్వారా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం బీఈడీ చేసి టీఆర్‌ఆర్‌టీ–2017లో జిల్లా టాపర్‌గా నిలిచినట్లు, ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ కోర్సు మెటీరియల్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.

పోటీ పరీక్షలకు ఉపయోగం.. ఎంఏ హిస్టరీలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అనిల్‌కుమార్‌ సరిగంటి మాట్లాడుతూ వర్సిటీ కోర్సు మెటీరియల్‌ పోటీ పరీక్షలకూ ఉపయోగపడుతుందని తెలిపారు. తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందించడం అభినందనీయమన్నారు.

ప్రాక్టికల్స్‌ బాగున్నాయి.. ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన కొత్తపల్లి హరిప్రియ మాట్లాడుతూ రెగ్యులర్‌ వర్సిటీలకు దీటుగా ప్రాక్టికల్స్‌ నిర్వహించారని తెలిపారు. కౌన్సిలింగ్‌ తరగతులు, అధ్యాపకుల బోధన బాగున్నాయని పేర్కొన్నారు.

Sthanikam

ఒకే కుటుంబంలో ముగ్గురికి పట్టాలు.. ఒకరికి గోల్డ్‌ మెడల్‌

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News