Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

నిస్వార్థ సేవకు చిరునామా – ఉపాధ్యాయ లోకానికి మన పెంటన్న

11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిస్వార్థ సేవకు ప్రతీకగా ‘మన పెంటన్న’

స్థానికం ప్రధాన ప్రతినిధి

పదవి కోసం కాదు… ప్రచారం కోసం కాదు… సేవే లక్ష్యంగా నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తగా ‘మన పెంటన్న’ ఉపాధ్యాయ లోకానికి సుపరిచితుడు.స్వార్థం లేకుండా, శ్రమకు లెక్క పెట్టకుండా, సమాజమే తన కుటుంబంగా భావిస్తూ సంఘం కోసం అహర్నిశలు శ్రమించే జీవితం ఆయనది.నిశ్శబ్దంగా పనిచేస్తూ దేశభక్తిని కార్యరూపంలో చూపించిన నిస్వార్థ సేవకుడిగా ఆయన ప్రయాణం అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. పేరు ప్రతిష్ఠలకన్నా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, తనకంటే సమాజం ముఖ్యమనే భావనతో ఆయన ముందుకు సాగారు.చిన్న వయసులోనే జాతీయ భావజాలంపై ప్రభావితుడై అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన, విద్యార్థి పరిషత్‌లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. ఆ తరువాత ఉపాధ్యాయ సంఘంలోనూ అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. సంఘం అప్పగించిన ప్రతి పనిని బాధ్యతగా స్వీకరించి, పూర్తయ్యే వరకు విశ్రాంతి లేకుండా శ్రమించడమే ఆయన ప్రత్యేకత.

ఉపాధ్యాయుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన,అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆయన నిస్వార్థ సేవకు దక్కిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు.

Sthanikam

నిస్వార్థ సేవకు చిరునామా – ఉపాధ్యాయ లోకానికి మన పెంటన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News