Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

Updated : 04 Mar 2026 19:49 IST
As Preferred Source 1 min read
న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో హోలీ పండుగ సంబరాలు ఈసారి దేశభక్తి భావనతో ఘనంగా జరిగాయి. స్థానిక హనుమాన్ మందిరం వద్ద గ్రామ యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు.

హోలీ పండుగకు ముందు రోజు సంప్రదాయబద్ధంగా కామ దహనం కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత కలిసి కామ దహనం కార్యక్రమంలో పాల్గొని చెడుపై మంచి విజయం సాధించినట్లు సూచిస్తూ అగ్నిని ప్రతిష్ఠించారు.

మన న్యాల్కల్ గ్రామం ఎప్పుడూ సంప్రదాయాలు, ఆచారాలు, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. పండుగలు వచ్చినప్పుడు గ్రామ ప్రజలంతా ఒక్కటై ఆనందంగా జరుపుకోవడం న్యాల్కల్ ప్రత్యేకత. ఈసారి కూడా హోలీ పండుగను అదే ఉత్సాహంతో జరుపుకుంటూ గ్రామ ప్రజలు ఐక్యతను చాటిచెప్పారు.

సాధారణంగా సినీ పాటలతో జరిగే వేడుకల్లో ఈసారి యువత దేశభక్తి గీతాలతో హోరెత్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగుల పండుగను దేశభక్తి భావనతో జరుపుకోవడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

మన న్యాల్కల్ నేల సంస్కృతి, సంప్రదాయాలు, స్నేహభావం మరోసారి ఈ హోలీ సంబరాల్లో ప్రతిబింబించాయి. రంగుల సందడితో న్యాల్కల్ అంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.

Sthanikam

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి