నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్ శనివారం సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, రోగుల వార్డులు, ప్రయోగశాల, మందుల విభాగం, రోగులకు అందిస్తున్న ఆహారం, సిబ్బంది హాజరు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఆసుపత్రి నిర్వహణ తీరుపై డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆసుపత్రిలోని వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరింత మెరుగుపరచాలని తెలిపారు. అలాగే మరోసారి ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవల పరిస్థితిని పరిశీలిస్తానని చెప్పారు. ఈ పర్యటనలో ఆర్‌ఎంఓ డాక్టర్ వికాస్, డాక్టర్ శ్రీకాంత్, ఫార్మసిస్ట్, ప్రయోగశాల సాంకేతిక నిపుణుడు, నర్సింగ్ సూపరింటెండెంట్‌తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి