Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేద కుటుంబానికి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ భరోసా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 02:12 PM

నారాయణగూడెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

నారాయణగూడెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

నారాయణగూడెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
07-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం అరుణ కంటి హాస్పిటల్, సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలపై అవగాహన కల్పించారు.

శిబిరంలో కంటి చూపు సమస్యలు, ఇతర కంటి సంబంధిత సమస్యలను పరీక్షించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. అలాగే, గ్రామస్తులకు తక్కువ ధరకే నాణ్యమైన కంటి అద్దాలను అందుబాటులో ఉంచారు. కంటి ఆపరేషన్ అవసరమున్న వారిని గుర్తించి, తదుపరి చికిత్స కోసం అరుణ కంటి హాస్పిటల్‌లో వైద్య సేవలు పొందాలని సూచించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాంపాటి వెంకట్, పంచాయతీ సెక్రటరీ, అరుణ,కంటి హాస్పిటల్ వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణగూడెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News