Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:38 PM

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మహిళా కాంగ్రెస్

03-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:జహీరాబాద్ పట్టణంలోని మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా పాల్గొని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించడమే ఈ సహాయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువచ్చే దిశగా మహిళా కాంగ్రెస్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. మహిళల సాధికారత, అమ్మాయిల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎలాంటి కుటుంబం కూడా వెనుకబడకూడదనే ఆలోచనతోనే ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో కూడా అవసరమైన కుటుంబాలకు అండగా నిలుస్తూ, మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగేలా మహిళా కాంగ్రెస్ పని చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మహిళా కాంగ్రెస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News