Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

నాగోల్‌లో ఇద్దరు బాలురు అదృశ్యం. పాఠశాలకు వెళ్లినట్లు భావించిన తల్లి.. ఆరా తీయగా స్కూల్‌కు రాలేదని వెల్లడి.

Updated : 01 Nov 2026 18:03 IST
As Preferred Source 1 min read
నాగోల్‌లో ఇద్దరు బాలురు అదృశ్యం.  పాఠశాలకు వెళ్లినట్లు భావించిన తల్లి.. ఆరా తీయగా స్కూల్‌కు రాలేదని వెల్లడి.

నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సాయిరాం నగర్ కాలనీకి చెందిన మొగిలి శిరీష (28) తన ఇద్దరు కుమారులు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం నగర్ కాలనీ, రోడ్ నంబర్‌ 3కు చెందిన శిరీష కుమారులు వరుణ్‌ తేజ్‌ (8), మహేష్‌ (6) నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వరుణ్‌ నాలుగో తరగతి, మహేష్‌ రెండో తరగతి చదువుతున్నారు. అక్టోబర్‌ 31న ఉదయం తల్లి పనికి వెళ్లి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించింది.

అనంతరం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను విచారించగా.. ఆ రోజు ఇద్దరు బాలురు పాఠశాలకు రాలేదని తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుర ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి