Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

నాగార్జున స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవం

07-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహనీయుల వేషధారణలో విద్యార్థినిలు ఆకట్టింపు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జున స్కూల్లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు సమాజానికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ మహిళామణుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. విద్యార్థినిలు ఉన్నత విద్య సాధించి సమాజ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు.

స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రేఖ మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ “గివ్ టు గైన్” అని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం, అవకాశాలు సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది సంధ్య, స్వప్న, విజయశ్రీ, లత, నరసింహ, వినిష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున స్కూల్లో ఘనంగా మహిళా దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News