Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మునగాలలో పోలీస్ ఓపెన్ హౌస్.. విద్యార్థులకు ప్రత్యేక అవగాహన

Updated : 24 Oct 2026 19:10 IST
As Preferred Source 1 min read
మునగాలలో పోలీస్ ఓపెన్ హౌస్.. విద్యార్థులకు ప్రత్యేక అవగాహన

నేర పరిశోధన, సీసీటీవీలు, ఫింగర్‌ప్రింట్‌ పరికరాల పనితీరుపై వివరించిన ఎస్సై సంజీవరెడ్డి

మునగాల పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థులకు పోలీస్‌ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సంజీవరెడ్డి పోలీసుల విధులు, నేరాల దర్యాప్తు విధానం, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, ఫింగర్‌ప్రింట్‌ పరికరాల పనితీరుపై విద్యార్థులకు వివరించారు. నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో తెలియజేశారు.అలాగే ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్రను వివరించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. పోలీస్‌ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు సమాజ రక్షణ కోసం చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహన పెరగడంతో పాటు, చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యతపై స్పష్టత కలిగింది.

Sthanikam

మునగాలలో పోలీస్ ఓపెన్ హౌస్.. విద్యార్థులకు ప్రత్యేక అవగాహన

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి