Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 07:26 PM

మోదీ 25 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు.

07-10-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. భువనగిరి పట్టణంలోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరు అశోక్‌గౌడ్‌ అధ్యక్షతన ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా వికసిత్‌ భారత్‌ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం ప్రధాని మోదీ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 2001లో గుజరాత్‌ సీఎంగా మోదీ ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం 2014లో ప్రధానమంత్రి స్థాయికి చేరిందన్నారు. 2019, 2024లోనూ ప్రజల మద్దతుతో ప్రధానిగా కొనసాగారని తెలిపారు.

జన్‌ధన్‌, స్వచ్ఛ భారత్‌, ఉజ్వల, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతోపాటు జీఎస్టీ, ఆర్టికల్‌ 370, అయోధ్య రామమందిర నిర్మాణం, కోవిడ్‌ సమయంలో చేపట్టిన చర్యలు, జీ20 సదస్సు వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించేందుకు ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి ప్రభుత్వ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం పట్టణంలో సేవా జ్యోతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మోదీ 25 ఏళ్ల ప్రస్థానం స్ఫూర్తిదాయకం. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News