నార్కట్ పల్లి: నల్లగొండ డివిజన్ పరిధిలోని జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా అంశాలపై శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డికి నార్కట్ పల్లి జర్నలిస్టులు హోటల్ వివేరా వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్నలిజంలో సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వినియోగంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు శివశంకర్ బాసెట్టి, శ్రీనివాస్ దేవరశెట్టి, నారాయణ, ప్రజ్ఞాపురం కృష్ణ, పల్లె తిరుమలేష్, బండారు రాంబాబు, దుబ్బాక నరేష్, రాధారపు రమేష్, కన్నెబోయిన నరసింహ, సోమ వెంకటరెడ్డి, శిరిశెట్టి సంతోష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి