Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:17 AM

మన వార్డు - మన యువత, క్రీడాకారుల కలలకు జినకల జంగయ్య నాగమణి దంపతుల భరోసా!

10-01-2026 456 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు స్థానికం ప్రతినిధి

గ్రామాల్లోని యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా 5వ వార్డు మెంబర్ జినకల నాగమణి - జంగయ్య దంపతులు ముందడుగు వేశారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఐదో వార్డ్ పరిధిలోని యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డు మెంబర్ జినకల నాగమణి జంగయ్య సమకూర్చిన క్రీడా కిట్లను యువతకు వారు స్వయంగా అందజేశారు.

ముఖ్య అతిథుల ప్రసంగం:

ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్‌లు మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. వార్డు సభ్యులు జంగయ్య తన వార్డులోని యువతపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వారికి కావాల్సిన సహకారాన్ని అందించడం అభినందనీయమని కొనియాడారు.

జినకల జంగయ్య మాట్లాడుతూ, "యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడమే మా ఉద్దేశం. భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

Sthanikam

మన వార్డు - మన యువత, క్రీడాకారుల కలలకు జినకల జంగయ్య నాగమణి దంపతుల భరోసా!

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News