Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:20 PM

మైనర్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్

27-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలో మైనర్ డ్రైవింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అని ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. అరైవ్ ఆలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా మండలంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు నియమ నిబంధన పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల పరిధిలో మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలు వాహనాలు తొలకంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రులు చేసే నేరమని, పిల్లలు రోడ్డు ప్రమాదాలకు గురైనా, కారనమైనా తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాలు ఇస్తే పిల్లల సరదా కాస్త విషాదమవుతుందని సూచించారు. అనేకచోట్ల మైనర్ డ్రైవింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతూ చాలామంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని వికలాంగులుగా అవుతున్నారని గుర్తు చేశారు. కావున తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో వారికి వాహనాలు ఇవ్వకూడదని కోరారు. మండల వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తామని ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికినట్లైతే అలాంటి వారిపై మరియు ప్రోత్సహిస్తున్న వాహన యజమానిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

మైనర్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం.. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News