Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

మహిళల ఆరోగ్యానికి ముందడుగు – నారాయణఖేడ్‌లో టీకా కార్యక్రమం ప్రారంభం

08-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భాశయ క్యాన్సర్ నివారణకు సంబంధించిన టీకాల కార్యక్రమాన్ని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి మరియు నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమ హారతి ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ టీకా గర్భాశయ క్యాన్సర్‌ను ఎక్కువ శాతం వరకు నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా బాలికలు మరియు యువతులు ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వయంగా బాలికలకు టీకా ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించడానికి ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 14 సంవత్సరాలు పూర్తైన బాలికలు మరియు యువతులు తప్పకుండా ఈ టీకాను తీసుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఈ టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల ఆరోగ్యానికి ముందడుగు – నారాయణఖేడ్‌లో టీకా కార్యక్రమం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News