వెలిమినేడు: మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వెలిమినేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు పెట్టుబడులు సమకూర్చి, వారి ఆధ్వర్యంలో దుస్తులు తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లోని బాలబాలికలకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్యగౌడ్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, వీవీకేలు ఆరూరి కలమ్మ, మహంకాళి వనజ, చింతకింది సుమతి, ఉంగరాల సుభాష్, సంఘబంధం అధ్యక్షురాలు కొంపెల్లి మానస, ఉపాధ్యక్షురాలు ఏనుగు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి