చిట్యాల: తెలంగాణ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న మధుకర్‌జీని బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. చిట్యాల మండల కేంద్రంలోని ఆర్గానిక్ హోటల్‌లో మధుకర్‌జీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరికంటి మొగులయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, జయరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి