మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో కోదాడకు చెందిన బచ్చలకూర సురేష్ రూపొందించిన ‘మాదక ద్రవ్యాలపై యుద్ధం’ డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఎస్పీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను, కుటుంబాల భవిష్యత్తును దెబ్బతీస్తుందని, వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి డాక్యుమెంటరీ రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం సురేష్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొల్లె విద్యాసాగర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలపై అవగాహనకు సురేష్ కృషి అభినందనీయం: ఎస్పీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి