Sthanikam - Truth Matters
Logo

ఎర్రగుంట కట్ట వద్ద మొక్కలు నాటిన గ్రామ పంచాయతీ ప్రతినిధులు

Updated : 22 Oct 2026 13:04 IST
As Preferred Source 1 min read
ఎర్రగుంట కట్ట వద్ద మొక్కలు నాటిన గ్రామ పంచాయతీ ప్రతినిధులు


చిన్నకాపర్తి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా చిన్నకాపర్తి గ్రామ పరిధిలోని ఎర్రగుంట కట్ట వద్ద మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

చెరువులు, వాటి పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

Sthanikam

ఎర్రగుంట కట్ట వద్ద మొక్కలు నాటిన గ్రామ పంచాయతీ ప్రతినిధులు

Article Image


చిన్నకాపర్తి: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా చిన్నకాపర్తి గ్రామ పరిధిలోని ఎర్రగుంట కట్ట వద్ద మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

చెరువులు, వాటి పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి