Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

లోఓల్టేజ్‌కు చెక్‌.. రైతులకు విద్యుత్‌ భరోసా! సీఈ బాలస్వామి.

Updated : 22 Oct 2026 12:42 IST
As Preferred Source 1 min read
లోఓల్టేజ్‌కు చెక్‌.. రైతులకు విద్యుత్‌ భరోసా! సీఈ బాలస్వామి.

రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడంతోపాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌శాఖ సీఈ బాలస్వామి తెలిపారు. గురువారం మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు ఐలాపురం, చంద్రమౌళితో మాట్లాడారు. విద్యుత్‌ సరఫరా, పంటల కోతలు, ఇతర సమస్యలపై ఆరా తీశారు.

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్‌ను ఆదా చేయవచ్చని వివరించారు. రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

లోఓల్టేజ్ సమస్యకు చెక్‌.

కొమ్మాయిగూడెం గ్రామంలో లోఓల్టేజ్ సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను సీఈ బాలస్వామి ప్రారంభించారు. దీంతో గ్రామంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో డీఈ డి.మల్లికార్జున్, ఏడీఈ కే.శ్రీకాంత్, ఏఈలు ఎం.కోటేశ్వరరావు, జి.నరసింహ, సర్పంచ్ ఎం.మల్లారెడ్డి, ఉపసర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు, కాంట్రాక్టర్ జి.రాంరెడ్డి, విద్యుత్‌ సిబ్బంది ఎం.నటరాజ్, టి.అశోక్, కే.శ్రీనివాస్‌రెడ్డి, కే.సత్తిరెడ్డి, ఎం.సురేష్, ఎం.యాదగిరి, ఎండీ.చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లోఓల్టేజ్‌కు చెక్‌.. రైతులకు విద్యుత్‌ భరోసా! సీఈ బాలస్వామి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి