దసరా పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,శాంతి, సమృద్ధి నింపాలని ఆకాంక్షించారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని,ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని గుఱ్ఱపు మచ్చేందర్ ఈ సందర్భంగా తెలిపారు.
కేటీఆర్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపిన జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి