దామరగిద్ద, అక్టోబర్ 17: మండలంలోని కండెనపల్లి గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన శ్రీ దుర్గాదేవి ప్రత్యేక పూజల్లో భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కె. రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
గ్రామానికి వచ్చిన రాజ్‌కుమార్‌రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భీష్మ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి