ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు గడ్డిపల్లి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి కిసాన్ మేళాకు మునగాల మండల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మునగాల మండల వ్యవసాయ అధికారి బి. రాజు బుధవారం పిలుపునిచ్చారు.
ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ప్రదర్శనలను రైతులు సందర్శించి, నిపుణుల సూచనలు పొందాలని ఆయన కోరారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కిసాన్ మేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి